గీ.సహన శీలమ్ము శాంతికి సాక్షియైన
తల్లి భూదేవి మదిలోన తల్లడిల్లి,
వెల్లడించెను 'బ్రహ్మ'తో వివరణముగ
తనయులైనట్టి నరజాతి దాష్టికముల
గీ.విశ్వమందున గ్రహముల వెట్టివైన
ప్రాణి కోటులు నాపైనె బ్రతుక గలవు;
నీరు, సస్యము, నిక్షిప్త సారములను
ఇచ్చి జీవింప జేతునె జీవినైన
గీ.లక్షలాదిగా జీవాలు లక్షణముగ
జీవనమ్మును సాగింప,చెనటులైన
నరులు మాత్రము నన్నేమి సరకు గనక,
కాలు దువ్వుచున్నారు నేల విడిచి
గీ.జన్మనిచ్చిన పితరుల జంపువారు;
పాలు త్రాగిన రొమ్మునే పగుల దీయు;
ఏరు దాటించు తెప్పనే యీడ్చువారు,
నరులు కాకుండా వేరు కా నంగ రాదు
ఉ.నూకలు చెల్లనో యనగ నూరక నుండ రదేమి చిత్రమో!
ఆకలి తీరదీ ధరణి నంతను పొట్టను పెట్టుకున్న నున్;
ఈ కలికాలమే నరుల నింతకు పాల్పడ జేయుచుండేగా?
నాకిక నోర్పు పోయినది;నా పలుకుల్ మరి పార్థు నస్త్రముల్
తల్లి భూదేవి మదిలోన తల్లడిల్లి,
వెల్లడించెను 'బ్రహ్మ'తో వివరణముగ
తనయులైనట్టి నరజాతి దాష్టికముల
గీ.విశ్వమందున గ్రహముల వెట్టివైన
ప్రాణి కోటులు నాపైనె బ్రతుక గలవు;
నీరు, సస్యము, నిక్షిప్త సారములను
ఇచ్చి జీవింప జేతునె జీవినైన
గీ.లక్షలాదిగా జీవాలు లక్షణముగ
జీవనమ్మును సాగింప,చెనటులైన
నరులు మాత్రము నన్నేమి సరకు గనక,
కాలు దువ్వుచున్నారు నేల విడిచి
గీ.జన్మనిచ్చిన పితరుల జంపువారు;
పాలు త్రాగిన రొమ్మునే పగుల దీయు;
ఏరు దాటించు తెప్పనే యీడ్చువారు,
నరులు కాకుండా వేరు కా నంగ రాదు
ఉ.నూకలు చెల్లనో యనగ నూరక నుండ రదేమి చిత్రమో!
ఆకలి తీరదీ ధరణి నంతను పొట్టను పెట్టుకున్న నున్;
ఈ కలికాలమే నరుల నింతకు పాల్పడ జేయుచుండేగా?
నాకిక నోర్పు పోయినది;నా పలుకుల్ మరి పార్థు నస్త్రముల్
No comments:
Post a Comment